Wednesday, December 29, 2010

'tegulu' pattina telugu cine saahityam

సరదాగా కాసేపు శ్రావ్యమైన పాట వినలేని సాహిత్యం...
సుమశ్యామల కల కల... శుభమంగళ గల... గల... పలికెనెలాగంటే... "ధినక్ ధిన జియా" అంట... ఏ వెధవ రాసాడో మనం వెధవలం కాబట్టి వింటున్నాం ...

గిరిగీస్తే గీటురాయి అంట? ప్రాస ఉంటే సరిపోతుంది... అర్ధం ఎవ్వడికి తెలుస్తుంది
నసపిలుపుల నిపుణుడు అంట మన కథా నాయకుడు...
మనసులు కలిస్తే వేదాలు వల్లించనక్కరలేదంట... అంతే కదా మరి అవి మనుషులకి కానీ దేయ్యలకెందుకు?

తెల్లవారగానే కొత్త తెలుగు పాట వినాలనే దుర్భుద్ధి నాకేల పుట్టవలె?
ఖర్మరా బాబు!

Monday, December 20, 2010

హక్కు!

అన్నదాతల ఆకలి కేకలు
ఆవురావురని
అర్రులుజాచాయి

వస్త్రకారుల ఎండు డొక్కలు
భగ్గు భగ్గున
మండుతున్నాయి

నీచకారుల నిండు కుండలు
ఓట్లకోసం... నోట్లకోసం
వీధినపడి కొట్టుకుంటున్నాయి

నోటుకోసం ఓటునమ్మిన
నీకేక్కడిది
ప్రశ్నించే హక్కు!

Tuesday, December 14, 2010

ప్చ్...

ఎందుకు పడాలి సకాలంలో వర్షాలు...
ఏల పండాలి మన నేల పంటలు...
ఏదానికి నిండాలె మన కడుపులు...
ఎందుకొరకు బాగు పడాలె మన జీవితాలు...

పగవానికైనా జేస్తాం సలాం... కాని మాతృభాషకిస్తామా గౌరవం
పొగబెట్టి కోట్లు దండుకునేవాని మాట వింటాం... కొట్టుకుంటాం అన్నదమ్ములం
పురుగుమందు తాగి రైతు చస్తే చూస్తూరుకుంటాం... విడగొట్టి దండుకునే టోళ్ళకి ఆత్మార్పణం
పక్కవాడి కంటి నీరు చోద్యం... ప్రగతి మనకెందుకు... అనర్ధం!!!