అది ఒక వెన్నెల కురిసిన రాత్రి! ప్రపంచం మత్తుగా నిద్రపోతున్న వేళ. ఎక్కడో లీలగా మంద్రంగా కమ్మని సంగీతం వింటూ నిద్రలోకి జారుతున్న నాకు. చలుక్కున మెలకువ వచ్చి కళ్ళు తెరచి చూసా.
“దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర సుపర్ణ కింపురుషోత్తముల కొనకంటితో కొల్లగట్టుగ
మేని సౌందర్యవతి రూప లావణ్యము వివరింపగ శ్రీనాథ కవిసార్వభౌముండు, పోతనామత్యుండు, కవి కాళిదాసుండు చింతిల్లగ
అవని ఆకాశ పాతాళంబునం వెదకిన దొరకని చెరుకుగని ...”
అని నాలో నేను పరవశించి పోతుంటే... బజ్జుకోనాన్న అని మా అమ్మ పక్కకి తిరగేస్తే నేనేంచేసేది?
నడుస్తూ వెళ్దామంటే నడిచే వయసు కాదు. పాకుదామంటే ఇంకా నేర్చుకోలేదు.. పోనీ పక్కకి తిరిగి చుద్దామంటే నేను పుట్టి గంటే అయ్యిందంట