Thursday, April 14, 2016

sandigdham - సందిగ్ధం

సుదీర్ఘపు బ్రతుకుదారిలో సేదతీరి నిల్వనిచ్చే నిల్వలుకరువయ్యెన్
రొప్పుతూ సాగుతున్న పయనమిది గమ్యమే అగమ్యగోచరం
రోజుల్గడిచెన్ పెగల్దీసి ఎక్కుపెట్టి సంధించిన విల్లుకంటే వెల్లువగా
దర్పణంబు వెక్కిరించె సగభాగంబు నెరిసెన్ మిగిలింది మరిసగమెనన్నట్టు

ఏమి సేయుదునీవేళ అస్త్రశాస్త్రముల్ దరిదాపుల కానవేలా
నివురుగప్పిందా నిప్పుకు నీటమునిగి బొగ్గుకఱచిందా
కట్టెదుట కలలసౌధము కట్టలుగ కూలుచున్నదా
చేష్ఠలుడిగి చేతకాక మెదడు కాస్తా చవటబాఱుతున్నదా