Monday, October 5, 2020

షరా మామూలే!

 మంచు తెరలు తొలగి వసంతం వచ్చేస్తుందనుకున్నాం అంతా

ఋతువులే కదా ఎక్కడికి పోతాయ్ ఒకదాని తర్వాత ఒకటి రావల్సిందే అనుకున్నాం అంతా

సాఫీగా సాగుతుందనుకుంటున్న సాగరయానం లోకి

తుఫాను ఒక ప్రళయం సృష్టించి 

నానా అవస్థలు పడుతున్న మన ఆర్ధిక వ్యవస్థలు

నన్ను చూడు నాజూకు చూడు అన్న మన జీవన శైలుల నడ్డివిరగ్గోట్టి

మనం అభివృద్ధి అనుకున్న మన మేని పొడుగు ప్రొద్దుపోయే వేళ మన నీడ మత్రమే అని సర్వ-అజ్ఞానులమైన మనకింకా తెలియరాలేదు

లేనిపోని ఆశలు కల్పించుకుని ఇప్పటికీ

ఇవాళ్టికి సద్దె దొరికితే చాలు అని సగటు దిగువ మధ్యతరగతి జీవులం బ్రతుకులు వెళ్ళదీసేస్తున్నాం 

మనకేంటి లోటు మనకి వచ్చేముందు మన జనాల్ని దాటుకుని రావలనుకున్న మండూకరేడులకు ఇప్పటికైనా అర్ధమయిందనుకుంటే 

మనం అమ్మకున్న ఓట్లతో గెలిచిన వాళ్ళు మన మీద అంత జాలిచూపిస్తారా?

షరా మామూలే! షరా మామూలే!! అనుకునే లోపు మళ్ళీ శీతాకాలం తారసపడేసింది  చలి కుంపట్లు తీయండహో!!!