Thursday, February 27, 2014
Wednesday, July 17, 2013
అన్నం తింటూ అనంత లోకాలకు చేరిన బిడ్డలారా మీకిదే అక్షర అశ్రునివాళి
అన్యాయం అరాచకం అభద్రత అన్నలేమి అవేమేం అందించే ఆస్తులు
కడుపునిండాతిని కంటినిండా కునుకుతీయాల్సిన కూనలను కాటికంపేము
చండాలుల ఛత్రంలో, చాదస్తపు చట్రంలో చిక్కుకుని ఛిద్రమయిన చిరంజీవులరా
తప్పుడు తలరాతలుమావి తప్పని తెల్సినా తలత్తలేని తటస్థపు తల్లితండ్రులమయ్యేము
పాప పుణ్యాలు పైవాడైనాఎరుగడా ? పాలుగారే పసిమోగ్గలను పొట్టనబెట్టుకున్నడా?
యదలో రగులుతున్న లావాలా వేడెక్కిన శంఖారావంతో అరిషడ్వర్గాలను హరించే వేళఉదయించేవరకు క్షంతవ్యులం
Wednesday, December 19, 2012
edo sardaaki
అది ఒక వెన్నెల కురిసిన రాత్రి! ప్రపంచం మత్తుగా నిద్రపోతున్న వేళ. ఎక్కడో లీలగా మంద్రంగా కమ్మని సంగీతం వింటూ నిద్రలోకి జారుతున్న నాకు. చలుక్కున మెలకువ వచ్చి కళ్ళు తెరచి చూసా.
“దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర సుపర్ణ కింపురుషోత్తముల కొనకంటితో కొల్లగట్టుగ
మేని సౌందర్యవతి రూప లావణ్యము వివరింపగ శ్రీనాథ కవిసార్వభౌముండు, పోతనామత్యుండు, కవి కాళిదాసుండు చింతిల్లగ
అవని ఆకాశ పాతాళంబునం వెదకిన దొరకని చెరుకుగని ...”
అని నాలో నేను పరవశించి పోతుంటే... బజ్జుకోనాన్న అని మా అమ్మ పక్కకి తిరగేస్తే నేనేంచేసేది?
నడుస్తూ వెళ్దామంటే నడిచే వయసు కాదు. పాకుదామంటే ఇంకా నేర్చుకోలేదు.. పోనీ పక్కకి తిరిగి చుద్దామంటే నేను పుట్టి గంటే అయ్యిందంట
Friday, December 7, 2012
desa bhaashalandu telugu lessa
ఉన్మత్తమోత్తములందు చెరుగిడుతున్న భావరేఖ్యము
మెత్తని అక్షదర్శకులయ్యె చేష్టలుడిగిన నిపుణుల్విదేశంబునకేగి
వితరణమయ్యె నాడు నేడు అంకుశంబు లేని మదపుటేనుగుబోలు
అచింతితత్యం కాదిది.. తేరుసారధింగానేనుండ పోరుగెల్వ నీవు సిద్ధమా?
Friday, June 24, 2011
వీడ్కోలు!
తుదిలేని సమరమంటూ
తేట తెలుగు పాటకు
తిరిగి ప్రాణం పోసినావు
బ్రతుకు విలువ శూన్యమంటూ
బాధల్లేని లోకాలకు
బయలుదేరి పొయినావా?
కన్నీటి వీడ్కోలయ్యా నీకు
ఓ! కలువ సాయీ!
తేట తెలుగు పాటకు
తిరిగి ప్రాణం పోసినావు
బ్రతుకు విలువ శూన్యమంటూ
బాధల్లేని లోకాలకు
బయలుదేరి పొయినావా?
కన్నీటి వీడ్కోలయ్యా నీకు
ఓ! కలువ సాయీ!
Tuesday, March 15, 2011
ఏందరో మహానుభావులు అందరికీ క్షమార్పణలు
అలనాడు మొల్ల ఎరున్గకబోయెనే
రామాయణ కాలపసురులు ఇలనాడు జనియింతురని
ఎవరుచెప్పగలరు జాషువాకి గబ్బిలమ్మొర శివుడాలకిన్చలేదని
బాపూజీ కలలుకన్న దేశం ఏనాటికి రాజాలదని
అన్నమయ్యకేమిదెల్సు శ్రీహరి సంకీర్తనల్దప్ప
ఆతనికేల తెల్పగలం కొంగొత్త భక్తులు సాలువుని మించిన సాయుధులని
ఏందరో మహానుభావులు అందరికీ క్షమార్పణలు!!
రామాయణ కాలపసురులు ఇలనాడు జనియింతురని
ఎవరుచెప్పగలరు జాషువాకి గబ్బిలమ్మొర శివుడాలకిన్చలేదని
బాపూజీ కలలుకన్న దేశం ఏనాటికి రాజాలదని
అన్నమయ్యకేమిదెల్సు శ్రీహరి సంకీర్తనల్దప్ప
ఆతనికేల తెల్పగలం కొంగొత్త భక్తులు సాలువుని మించిన సాయుధులని
ఏందరో మహానుభావులు అందరికీ క్షమార్పణలు!!
Tuesday, March 8, 2011
yem maayaro
రగులుతున్న రావణ కాష్టం రంగుడబ్బాల్లో చూపిస్తాండు
చితిమంటలల చలి కాగే 'మేధావులు' భేష్ భేష్
ఫైలైయితే పరీచ్చల్ల! బువ్వెవడు పెడతాండు?
అరచేతిలో చూడు బిడ్డా! గాలిమేడలు కడ్తున్నాం... లక్ష కోట్లు ఏడికిబాయే! సప్పుడుజెయ్యకుబే.. హుష్!!
చితిమంటలల చలి కాగే 'మేధావులు' భేష్ భేష్
ఫైలైయితే పరీచ్చల్ల! బువ్వెవడు పెడతాండు?
అరచేతిలో చూడు బిడ్డా! గాలిమేడలు కడ్తున్నాం... లక్ష కోట్లు ఏడికిబాయే! సప్పుడుజెయ్యకుబే.. హుష్!!
Subscribe to:
Posts (Atom)
