Wednesday, December 29, 2010

'tegulu' pattina telugu cine saahityam

సరదాగా కాసేపు శ్రావ్యమైన పాట వినలేని సాహిత్యం...
సుమశ్యామల కల కల... శుభమంగళ గల... గల... పలికెనెలాగంటే... "ధినక్ ధిన జియా" అంట... ఏ వెధవ రాసాడో మనం వెధవలం కాబట్టి వింటున్నాం ...

గిరిగీస్తే గీటురాయి అంట? ప్రాస ఉంటే సరిపోతుంది... అర్ధం ఎవ్వడికి తెలుస్తుంది
నసపిలుపుల నిపుణుడు అంట మన కథా నాయకుడు...
మనసులు కలిస్తే వేదాలు వల్లించనక్కరలేదంట... అంతే కదా మరి అవి మనుషులకి కానీ దేయ్యలకెందుకు?

తెల్లవారగానే కొత్త తెలుగు పాట వినాలనే దుర్భుద్ధి నాకేల పుట్టవలె?
ఖర్మరా బాబు!

Monday, December 20, 2010

హక్కు!

అన్నదాతల ఆకలి కేకలు
ఆవురావురని
అర్రులుజాచాయి

వస్త్రకారుల ఎండు డొక్కలు
భగ్గు భగ్గున
మండుతున్నాయి

నీచకారుల నిండు కుండలు
ఓట్లకోసం... నోట్లకోసం
వీధినపడి కొట్టుకుంటున్నాయి

నోటుకోసం ఓటునమ్మిన
నీకేక్కడిది
ప్రశ్నించే హక్కు!

Tuesday, December 14, 2010

ప్చ్...

ఎందుకు పడాలి సకాలంలో వర్షాలు...
ఏల పండాలి మన నేల పంటలు...
ఏదానికి నిండాలె మన కడుపులు...
ఎందుకొరకు బాగు పడాలె మన జీవితాలు...

పగవానికైనా జేస్తాం సలాం... కాని మాతృభాషకిస్తామా గౌరవం
పొగబెట్టి కోట్లు దండుకునేవాని మాట వింటాం... కొట్టుకుంటాం అన్నదమ్ములం
పురుగుమందు తాగి రైతు చస్తే చూస్తూరుకుంటాం... విడగొట్టి దండుకునే టోళ్ళకి ఆత్మార్పణం
పక్కవాడి కంటి నీరు చోద్యం... ప్రగతి మనకెందుకు... అనర్ధం!!!

Saturday, September 18, 2010

ఏమో తెలీదు!

వినువీధి విహరించగల్గెన్... శశిశిరస్సున పదంబుమోపినన్
జన్యురహస్యంబు ఛేదించగల్గినన్... సృష్టి అద్యంతంబులు ఎరుంగబూనినన్
మస్తిష్క గమనమెవ్వడు లెక్కింపగల్గెను
హృదయస్పందననెవ్వడూహించగల్గెను

Thursday, May 27, 2010

వెళ్ళు

స్తబ్దత వేళ్ళూనుకున్న పంజరం నుంచి
నగారాలు బద్దలుకోట్టినా నిద్రాణువై ఉన్న వ్యవస్థ నుంచి
ప్రమాదం ముంచుకొస్తున్నా ప్రమోదంలో మునిగివున్న నీరోలనుంచి
శిధిలమవుతూ ఉన్నా చూరు పట్టుకు వేళ్ళాడే బేతాళులనుంచి... (to be continued)

Monday, May 24, 2010

Tribute Veturi Sundararama Murthy garu

తెలుగు నేల వెల వెల బోయే వేటూరి లేక
రాలిపోయిందా పువ్వు రాగాలు వినిపించావా ఇక
సరి సరి పదముల సిరి సిరి పాటలు కనిపించవా ఇక
కొమ్మ కొమ్మకో సన్నాయి పూయించే చేయి సెలవు తీసుకుందా ఇక

అచ్చెరువున అచ్చెరువున చెమ్మగిల్లిన కన్నులతోడ
ఆబాల గోపాలమందించే కన్నీటి భాష్పంజలి
అందుకోవయ్యా! సుందర రామయ్యా!!

Wednesday, May 5, 2010

అనుబంధం

అనుబంధం
అనునిత్యం ఆహ్లాదం... అణువంతైనా లేదు నిర్వేదం
చిరునవ్వుల మోము... మధురమయ్యేను వేము
బుడి బుడి నడకలు... చేసెను వేడుకలు
అర్ధంలేని మాటలు... చెప్పెనెన్నోఊసులు
ఆకలేస్తే ఏడుపు.... లేదంటే లేదు ఆటకి ఆటవిడుపు
చూస్తే కళ్ళల్లో నీళ్ళు... తిప్పించేను గుండెల్లో సుళ్ళు

Thursday, April 29, 2010

niddarotundi manamena?

వివరమెరిగిన మిత్రమా!
కాలం కలిసి రాలేదని...కష్టాల్ కడ తేరలేదని...ఎటు చూసినా శూన్యమని...
దుఖిస్తున్నావా?

మతిలేని సమాజంలో... గతిలేక బతుకీడుస్తున్నాం...
రాతి మనుషుల సమూహంలో...మచ్చలేని పాలరాతిని పగలగొడుతున్నాం...
ఇంకా వేచి ఉందామా అభ్యుదయం కోసం
తట్టి లేపలేమా గాఢ నిద్దరోతున్న జీవచ్చవాలను అసలైన శుభోదయం కోసం