Monday, March 24, 2014

A Tribute to Manduvaa logillu


మా ఊళ్ళో మండువా లోగిళ్ళు

నలుచెరగుల బాటసారులకు విశ్రాంతినందించిన చల్లటి అరుగుల ముంగిళ్ళు
పెళ్ళిళ్ళూ పండగలకు శోభయమానంగా ముస్తాబయ్యే వాకిళ్ళు 
అతివల సొబగుల రెట్టింపు చేసేందుకేనా అన్నట్టు విరగబూసేను పెరళ్ళు
నిత్యం చుట్టాపట్టలతో కళకళలాడేవి కావా అవి సంతొషాలకు ఆనవాళ్ళు  


మొన్నటి తరాల వైభవాల మచ్చు తునకలు
మరుసటి తరాల నిర్లక్ష్యపు వైఖరుల చేదు గుళికలు
నేతి తరాల పట్నపువాసాల, ప్రవాసాల వలసలకు మిగిలిన మొండి గోడలు
చరిత్రను గూర్చి తెల్సుకునే తీరిక లేని రేపటి తరాలకు అవి అర్ధంలేని ప్రశ్నలు 

Thursday, March 20, 2014

corporate dalaarulu

చెదలు పట్టిన మెదడు పొరల్ని అలోచనా నాగళ్ళతో దున్నించి
అక్షరాలనే విత్తనాలు నాటి, రేయింబవళ్లు నిద్రలేమికి వచ్చే కన్నీటితో పొలం తడిపి

మునివేళ్ళు రక్తమోడువరకు మీటలతో కలుపుదీసి, 
అలుపనక సొలుపనక గొంతు చించుకు కాపుగాయిస్తే
తీరా పంటచేతికొచ్చె పండగ నాటికి 
రాబందుల దళారుల్లా, ఎవడబ్బ సొమ్మని మన పొట్టలు గొట్టేరు వీళ్ళు
పనికి రాని వాజమ్మలు, మూడే అక్షరాలు తెలిసిన ముదనష్టపు త్రాష్టులు