మా ఊళ్ళో మండువా లోగిళ్ళు
నలుచెరగుల బాటసారులకు విశ్రాంతినందించిన చల్లటి అరుగుల ముంగిళ్ళు
పెళ్ళిళ్ళూ పండగలకు శోభయమానంగా ముస్తాబయ్యే వాకిళ్ళు
అతివల సొబగుల రెట్టింపు చేసేందుకేనా అన్నట్టు విరగబూసేను పెరళ్ళు
నిత్యం చుట్టాపట్టలతో కళకళలాడేవి కావా అవి సంతొషాలకు ఆనవాళ్ళు
మొన్నటి తరాల వైభవాల మచ్చు తునకలు
మరుసటి తరాల నిర్లక్ష్యపు వైఖరుల చేదు గుళికలు
నేతి తరాల పట్నపువాసాల, ప్రవాసాల వలసలకు మిగిలిన మొండి గోడలు
చరిత్రను గూర్చి తెల్సుకునే తీరిక లేని రేపటి తరాలకు అవి అర్ధంలేని ప్రశ్నలు
No comments:
Post a Comment