Sunday, September 15, 2019

దోమా కుట్టాకే నన్ను

దోమా కుట్టాకే నన్ను
మా డాక్టరయ్య సూదిమందేస్తడు
జర్రంత సుర్రుమనించిండు
మా అయ్య ఆస్తులన్ని కాజేసిండు

దోమా కుట్టాకే నన్ను
మా దొరబాబు గుస్స జేస్తడు
పదారువేల పధకాలు పెట్టిండంట
పనులన్నీ వాటంతట అవే అయితయంట

దోమా కుట్టాకే నన్ను
ఇల్లు మొత్తం సాఫ్ జేస్తా
మా అయ్య జాగీర్లు కదా రోడ్లన్నీ గలీజ్ జేస్తా
నా పని మాత్రం నేను జెయ్య పక్కొడి మీద పడి ఎడుస్తా

దోమా కుట్టాకే నన్ను
ఏం జేషినా సిగ్గైతె మాకు రాదు
ఇజ్జత్ గసొంటివి తెల్లోల్లు తోల్కబొయిండ్రు
మమ్మల్ని కుడితే నువ్వు కూడా మా లాగైతవ్ కుట్టే ముందు జర సోంచాయించుకో

No comments: