Monday, March 24, 2014

A Tribute to Manduvaa logillu


మా ఊళ్ళో మండువా లోగిళ్ళు

నలుచెరగుల బాటసారులకు విశ్రాంతినందించిన చల్లటి అరుగుల ముంగిళ్ళు
పెళ్ళిళ్ళూ పండగలకు శోభయమానంగా ముస్తాబయ్యే వాకిళ్ళు 
అతివల సొబగుల రెట్టింపు చేసేందుకేనా అన్నట్టు విరగబూసేను పెరళ్ళు
నిత్యం చుట్టాపట్టలతో కళకళలాడేవి కావా అవి సంతొషాలకు ఆనవాళ్ళు  


మొన్నటి తరాల వైభవాల మచ్చు తునకలు
మరుసటి తరాల నిర్లక్ష్యపు వైఖరుల చేదు గుళికలు
నేతి తరాల పట్నపువాసాల, ప్రవాసాల వలసలకు మిగిలిన మొండి గోడలు
చరిత్రను గూర్చి తెల్సుకునే తీరిక లేని రేపటి తరాలకు అవి అర్ధంలేని ప్రశ్నలు 

Thursday, March 20, 2014

corporate dalaarulu

చెదలు పట్టిన మెదడు పొరల్ని అలోచనా నాగళ్ళతో దున్నించి
అక్షరాలనే విత్తనాలు నాటి, రేయింబవళ్లు నిద్రలేమికి వచ్చే కన్నీటితో పొలం తడిపి

మునివేళ్ళు రక్తమోడువరకు మీటలతో కలుపుదీసి, 
అలుపనక సొలుపనక గొంతు చించుకు కాపుగాయిస్తే
తీరా పంటచేతికొచ్చె పండగ నాటికి 
రాబందుల దళారుల్లా, ఎవడబ్బ సొమ్మని మన పొట్టలు గొట్టేరు వీళ్ళు
పనికి రాని వాజమ్మలు, మూడే అక్షరాలు తెలిసిన ముదనష్టపు త్రాష్టులు

Wednesday, July 17, 2013

అన్నం తింటూ అనంత లోకాలకు చేరిన బిడ్డలారా మీకిదే అక్షర అశ్రునివాళి

అన్యాయం అరాచకం అభద్రత అన్నలేమి అవేమేం అందించే ఆస్తులు 
కడుపునిండాతిని కంటినిండా కునుకుతీయాల్సిన కూనలను కాటికంపేము 
చండాలుల ఛత్రంలో, చాదస్తపు చట్రంలో చిక్కుకుని ఛిద్రమయిన చిరంజీవులరా 
తప్పుడు తలరాతలుమావి   తప్పని తెల్సినా తలత్తలేని తటస్థపు తల్లితండ్రులమయ్యేము 
పాప పుణ్యాలు పైవాడైనాఎరుగడా ? పాలుగారే పసిమోగ్గలను పొట్టనబెట్టుకున్నడా?
యదలో రగులుతున్న లావాలా వేడెక్కిన శంఖారావంతో అరిషడ్వర్గాలను హరించే వేళఉదయించేవరకు క్షంతవ్యులం 

Wednesday, December 19, 2012

edo sardaaki


అది ఒక వెన్నెల కురిసిన రాత్రిప్రపంచం మత్తుగా నిద్రపోతున్న వేళఎక్కడో లీలగా మంద్రంగా కమ్మని సంగీతం వింటూ నిద్రలోకి జారుతున్న నాకుచలుక్కున మెలకువ వచ్చి కళ్ళు తెరచి చూసా.
దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర సుపర్ణ కింపురుషోత్తముల కొనకంటితో కొల్లగట్టుగ
మేని సౌందర్యవతి రూప లావణ్యము వివరింపగ శ్రీనాథ కవిసార్వభౌముండుపోతనామత్యుండుకవి కాళిదాసుండు చింతిల్లగ
అవని ఆకాశ పాతాళంబునం వెదకిన దొరకని చెరుకుగని ...”
అని నాలో నేను పరవశించి పోతుంటే... బజ్జుకోనాన్న అని మా అమ్మ పక్కకి తిరగేస్తే నేనేంచేసేది?
నడుస్తూ వెళ్దామంటే నడిచే వయసు కాదుపాకుదామంటే ఇంకా నేర్చుకోలేదు.. పోనీ పక్కకి తిరిగి చుద్దామంటే నేను పుట్టి గంటే అయ్యిందంట

Friday, December 7, 2012

desa bhaashalandu telugu lessa


ఉన్మత్తమోత్తములందు  చెరుగిడుతున్న భావరేఖ్యము 
మెత్తని అక్షదర్శకులయ్యె చేష్టలుడిగిన నిపుణుల్విదేశంబునకేగి 
వితరణమయ్యె నాడు నేడు అంకుశంబు లేని మదపుటేనుగుబోలు 
అచింతితత్యం కాదిది.. తేరుసారధింగానేనుండ పోరుగెల్వ నీవు  సిద్ధమా?

Friday, June 24, 2011

వీడ్కోలు!

తుదిలేని సమరమంటూ
తేట తెలుగు పాటకు
తిరిగి ప్రాణం పోసినావు

బ్రతుకు విలువ శూన్యమంటూ
బాధల్లేని లోకాలకు
బయలుదేరి పొయినావా?

కన్నీటి వీడ్కోలయ్యా నీకు
ఓ! కలువ సాయీ!