Sunday, October 22, 2017

ఇంతకుముందు కూడా ఇంతేనేమో మరి...

విద్యనొసంగు వానికిన్ వివేకమ్ము కరువాయె... విద్యనేర్చిన వింతపశువులేగదా నేటి సంఘంబనిన
వైద్యమొనర్చు మనుజుండు విషపు సూదులు గ్రుచ్చె... అంతుబట్టని వింత రోగమ్ముల నెలవాయెనే పెయ్యి
దైవతత్వము వీడిరి మూఢత్వంబు ప్రవచించిరి... పక్కవాడే నిన్న, పగవాడయ్యెనే నేటికి
రాజ్య పాలకులనుచు విదూషకుల వెల్లువొచ్చె... గణతంత్రమనిన కోట్లుగుమ్మరించు  'గణిత ' శాస్త్రపు ఘనాపాటీలే మరి 

1 comment:

sri said...

ప్రకృతి తన దైవ తత్వాన్ని తన గణితం లో చూపించేవరకే మన గణిత శాస్త్రాలు