Friday, December 7, 2012

desa bhaashalandu telugu lessa


ఉన్మత్తమోత్తములందు  చెరుగిడుతున్న భావరేఖ్యము 
మెత్తని అక్షదర్శకులయ్యె చేష్టలుడిగిన నిపుణుల్విదేశంబునకేగి 
వితరణమయ్యె నాడు నేడు అంకుశంబు లేని మదపుటేనుగుబోలు 
అచింతితత్యం కాదిది.. తేరుసారధింగానేనుండ పోరుగెల్వ నీవు  సిద్ధమా?

Friday, June 24, 2011

వీడ్కోలు!

తుదిలేని సమరమంటూ
తేట తెలుగు పాటకు
తిరిగి ప్రాణం పోసినావు

బ్రతుకు విలువ శూన్యమంటూ
బాధల్లేని లోకాలకు
బయలుదేరి పొయినావా?

కన్నీటి వీడ్కోలయ్యా నీకు
ఓ! కలువ సాయీ!

Tuesday, March 15, 2011

ఏందరో మహానుభావులు అందరికీ క్షమార్పణలు

అలనాడు మొల్ల ఎరున్గకబోయెనే
రామాయణ కాలపసురులు ఇలనాడు జనియింతురని
ఎవరుచెప్పగలరు జాషువాకి గబ్బిలమ్మొర శివుడాలకిన్చలేదని
బాపూజీ కలలుకన్న దేశం ఏనాటికి రాజాలదని
అన్నమయ్యకేమిదెల్సు శ్రీహరి సంకీర్తనల్దప్ప
ఆతనికేల తెల్పగలం కొంగొత్త భక్తులు సాలువుని మించిన సాయుధులని
ఏందరో మహానుభావులు అందరికీ క్షమార్పణలు!!

Tuesday, March 8, 2011

yem maayaro

రగులుతున్న రావణ కాష్టం రంగుడబ్బాల్లో చూపిస్తాండు
చితిమంటలల చలి కాగే 'మేధావులు' భేష్ భేష్
ఫైలైయితే పరీచ్చల్ల! బువ్వెవడు పెడతాండు?
అరచేతిలో చూడు బిడ్డా! గాలిమేడలు కడ్తున్నాం... లక్ష కోట్లు ఏడికిబాయే! సప్పుడుజెయ్యకుబే.. హుష్!!

Wednesday, December 29, 2010

'tegulu' pattina telugu cine saahityam

సరదాగా కాసేపు శ్రావ్యమైన పాట వినలేని సాహిత్యం...
సుమశ్యామల కల కల... శుభమంగళ గల... గల... పలికెనెలాగంటే... "ధినక్ ధిన జియా" అంట... ఏ వెధవ రాసాడో మనం వెధవలం కాబట్టి వింటున్నాం ...

గిరిగీస్తే గీటురాయి అంట? ప్రాస ఉంటే సరిపోతుంది... అర్ధం ఎవ్వడికి తెలుస్తుంది
నసపిలుపుల నిపుణుడు అంట మన కథా నాయకుడు...
మనసులు కలిస్తే వేదాలు వల్లించనక్కరలేదంట... అంతే కదా మరి అవి మనుషులకి కానీ దేయ్యలకెందుకు?

తెల్లవారగానే కొత్త తెలుగు పాట వినాలనే దుర్భుద్ధి నాకేల పుట్టవలె?
ఖర్మరా బాబు!

Monday, December 20, 2010

హక్కు!

అన్నదాతల ఆకలి కేకలు
ఆవురావురని
అర్రులుజాచాయి

వస్త్రకారుల ఎండు డొక్కలు
భగ్గు భగ్గున
మండుతున్నాయి

నీచకారుల నిండు కుండలు
ఓట్లకోసం... నోట్లకోసం
వీధినపడి కొట్టుకుంటున్నాయి

నోటుకోసం ఓటునమ్మిన
నీకేక్కడిది
ప్రశ్నించే హక్కు!

Tuesday, December 14, 2010

ప్చ్...

ఎందుకు పడాలి సకాలంలో వర్షాలు...
ఏల పండాలి మన నేల పంటలు...
ఏదానికి నిండాలె మన కడుపులు...
ఎందుకొరకు బాగు పడాలె మన జీవితాలు...

పగవానికైనా జేస్తాం సలాం... కాని మాతృభాషకిస్తామా గౌరవం
పొగబెట్టి కోట్లు దండుకునేవాని మాట వింటాం... కొట్టుకుంటాం అన్నదమ్ములం
పురుగుమందు తాగి రైతు చస్తే చూస్తూరుకుంటాం... విడగొట్టి దండుకునే టోళ్ళకి ఆత్మార్పణం
పక్కవాడి కంటి నీరు చోద్యం... ప్రగతి మనకెందుకు... అనర్ధం!!!